భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: నారపల్లి పరిధిలోని చౌదరిగూడలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. చౌదరిగూడలోని వినాయకుడి గుడి ఆవరణలో నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు, పురుషులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మలు, బుడ్డెమ్మలతో పండుగ ప్రాంగణం సందడిగా మారింది.

కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి వేడుకల్లో పాల్గొని పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. అందరూ కలిసికట్టుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది.

ఇలాంటి పండుగ వేడుకలు భవిష్యత్తులోనూ మరిన్ని నిర్వహించుకోవాలని స్థానికులు ఆకాంక్షించారు.…