భారత్ సమాచార్, అమెరికా: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. షార్లెట్‌లో ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా నిర్వహించగా, మిషిగన్‌లో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) నూతన చాప్టర్‌ను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు, యువత భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ రెండు కార్యక్రమాల్లో ప్రత్యేకతగా నిలిచింది.
షార్లెట్ తెలుగు సంబరాల్లో కళల సందడి
అమెరికాలోని షార్లెట్‌లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకల్లో చిన్నారులు, యువత, పెద్దలు తమ ప్రతిభను…






