భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం సహాయ రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నీలి ప్రసాద్ (57) చికిత్స పొందుతూ మృతి చెందారు. విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దచింతకుంట గ్రామ శివారులోని జల హనుమాన్ ఆలయం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది. విధుల నిమిత్తం బయలుదేరిన అధికారి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో సహచరులు, పరిచయస్తులు…