భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగింది. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అయితే దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు పండుగ ఏర్పాట్లు, వేడుకల్లో నిమగ్నమై ఉండటంతో ప్రజావాణికి వినతులు తక్కువగా వచ్చాయి. గత వారాలతో పోలిస్తే ఈసారి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజా…