భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) గొప్ప వరమని ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన 12 మందికి రూ.3 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డితో కలిసి సర్పంచ్ కుమార్ లబ్ధిదారులకు…