భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా చిన్ననాగారం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం గ్రామంలోని చారిత్రక ముత్యాలమ్మ ఆలయ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయదశమి పండుగ విశిష్టతను చాటిచెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు ఆసక్తిగా తరలివచ్చారు. పండుగ వాతావరణంలో రావణ వధ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు…






