భార‌త్ స‌మాచార్, హెల్త్ : మంచి ఆరోగ్యానికి పోషకాహారం, వ్యాయామంతో పాటు తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది పని ఒత్తిడి, మొబైల్ ఫోన్ వినియోగం కారణంగా సరైన సమయానికి నిద్రపోవడం లేదు. అయితే, నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దలు సాధారణంగా రాత్రికి కనీసం 7 గంటలు నిద్రపోవడం మంచిదని ఆరోగ్య మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే, రోజూ ఏడు గంటలు నిద్రపోతే పదేళ్లు ఎక్కువ జీవిస్తారనే…