భార‌త్ స‌మాచార్, టెక్నాల‌జీ : హైవేలపై ప్రయాణించేటప్పుడు వాహన వేగాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. రహదారులపై ఏర్పాటు చేసిన స్పీడ్ కెమెరాలు, ఆటోమేటిక్ నిఘా వ్యవస్థల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలకు చలానాలు జారీ అయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రయాణ సమయంలో రహదారిపై అనుమతించిన గరిష్ఠ వేగాన్ని గుర్తుంచుకోవడం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో అందుబాటులో ఉన్న స్పీడ్ లిమిట్, స్పీడోమీటర్ ఫీచర్లు డ్రైవర్లకు వాహన వేగంపై అవగాహన కల్పించడంలో సహాయపడతాయి.

…