భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విజయదశమి పండుగ సందర్భంగా మెదక్ జిల్లా శివంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.
వివరాల ప్రకారం, బీఆర్ఎస్ వర్గానికి చెందిన డీజే ఏర్పాటు చేసిన ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ కట్టడంపై వివాదం…






