భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విజయదశమి వేడుకల సందర్భంగా మెదక్ జిల్లా హత్నూరలో రావణాసురుడి దహనం విషయంలో వివాదం చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావణ దహన కార్యక్రమానికి సంబంధించి తలెత్తిన వివాదం క్రమంగా హిందూ సంఘాలు, దళిత సంఘాల నిరసనలకు దారితీసింది. పండుగ వేళ చోటుచేసుకున్న ఈ పరిణామాలతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

రావణ దహన కార్యక్రమం సందర్భంగా శ్రీరాముడిని అవమానించేలా వ్యవహరించారని, దుర్గామాత దీక్షాపరులను అవమానించారని…