భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిభావంతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జనాన్ని పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించిన అమ్మవారి శోభాయాత్ర భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక నినాదాల మధ్య వైభవంగా సాగింది. హిందూవాహిని ఆధ్వర్యంలో నవరాత్రుల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నర్సాపూర్ పట్టణంలోని వివిధ వీధుల గుండా సాగిన శోభాయాత్రలో…






