భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ పట్టణంలోని గూపన్‌పల్లి మూడో డివిజన్‌లో శ్రీ భవాని శరణ్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత నిమజ్జన వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, నిమజ్జన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ వేడుకలతో గూపన్‌పల్లి ప్రాంతంలో పండుగ సందడి నెలకొంది.

నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి అభిషేకం,…