భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఆదివాసీల హక్కుల కోసం పోరాడి చరిత్రలో చెరగని ముద్ర వేసిన విప్లవ వీరుడు కొమురం భీం జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల ఆరాధ్య దైవంగా భావించే కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ జయంతి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
చేపూర్ ఆదివాసీ నాయకపోడ్ కులస్తుల సంఘం పెద్దమనిషి మేడిపల్లి గౌతమ్, చేపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు…






