భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి పదోన్నతులు లభించాయి. ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా SP డి.వి. శ్రీనివాస రావు IPS పదోన్నతి పొందిన సిబ్బందికి ర్యాంక్ చిహ్నాలు అలంకరించి అభినందించారు. కొత్త హోదాలతో మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న షరీఫ్, రాజు, శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, వెంకయ్యలకు పదోన్నతులు లభించాయి.…