భారత్ సమాచార్, లైఫ్ స్టైల్ : ఎదుటివారు మనం చెప్పినట్లు వినకపోయినా, అవమానించినా, ఆశించిన ఫలితాలు దక్కకపోయినా కోపం రావడం సహజం. అయితే, ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నామన్నదే కీలకం. కోపం అనేది సాధారణ భావోద్వేగమే అయినప్పటికీ, దాన్ని అదుపు చేసుకోలేక పదేపదే అరవడం, దూకుడుగా ప్రవర్తించడం వల్ల కుటుంబ సంబంధాలు, స్నేహాలు, వృత్తిపరమైన జీవితం దెబ్బతినే ప్రమాదం ఉంది. కోపం వచ్చినప్పుడు శరీరంలో ఒత్తిడికి సంబంధించిన ప్రతిస్పందనలు మొదలవుతాయి. గుండె వేగం, రక్తపోటు, శ్వాస వేగం పెరగవచ్చు. దీర్ఘకాలంగా అదుపులో లేని కోపం…