భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదనే భావనతో వలిగొండ మండల కేంద్రంలో సాయిబాబా ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాయిబాబా ఆశీస్సులతో భక్తులకు, అవసరమైన వారికి అన్నదానం చేస్తూ ట్రస్టు సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.
ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా సేవాభావాన్ని చాటుతున్నారు. భక్తితో పాటు మానవత్వానికి ప్రాధాన్యతనిస్తూ, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించాలనే సంకల్పంతో ట్రస్టు సభ్యులు ముందుకు…






