భారత్ సమాచార్, హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌కు పెద్దఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ప్రభాస్‌పై ఉన్న అభిమానాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు పలువురు ఫ్యాన్స్ హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44…