భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే విద్యుత్ కోతలు పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆరోపించారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ ముందుచూపు లేకపోవడం, సరైన కార్యాచరణ రూపొందించకపోవడమే కారణమని రాధా మల్లేష్ గౌడ్ అన్నారు. ఎల్‌-నినో ప్రభావం…