భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నార్సింగి ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు, వరి…