భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కరెంటు కోతలు, సాగునీటి కొరతతో చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని నర్సాపూర్ నియోజకవర్గ రైతులు మాజీ మంత్రి, BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హరీశ్ రావు, ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుమార్ అనే రైతు తనకు ఎదురైన పరిస్థితిని వివరిస్తూ కంటతడి పెట్టారు. సకాలంలో కరెంటు సరఫరా లేకపోవడంతో…






