భార‌త్ స‌మాచార్, అమ‌రావ‌తి : కౌంటింగ్‌కు ముందే గుండెపోటుతో మరణించిన ఓ మహిళా అభ్యర్థి ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించడం తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నికల్లో గెలిచిన ఆనందాన్ని స్వయంగా ఆస్వాదించలేకపోయిన ఆమె ఉదంతం స్థానికులను కలచివేస్తోంది. జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసిన గారపాటి దివ్య.. వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ గెలుపు వార్త వెలువడే సమయానికి ఆమె ప్రాణాలతో లేకపోవడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం…