భార‌త్ స‌మాచార్, ఆరోగ్యం : రోజూ కడుపునిండా భోజనం చేస్తున్నప్పటికీ అలసట, నీరసం వేధిస్తున్నాయా? అయితే మీ ఆహారంలో అవసరమైన పోషకాలు, ముఖ్యంగా ప్రోటీన్ తగినంతగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ప్రోటీన్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లేవారికి, కండరాలు పెంచుకోవాలనుకునేవారికి మాత్రమే అవసరమనే అపోహ చాలామందిలో ఉంది. వాస్తవానికి శరీరంలోని కణజాల నిర్మాణం, కండరాల నిర్వహణ, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, దెబ్బతిన్న కణాల మరమ్మతు వంటి అనేక కీలక విధులకు ప్రోటీన్ అవసరం. అందుకే వయసు, శరీర బరువు, శారీరక శ్రమను బట్టి రోజువారీ…