భార‌త్ స‌మాచార్, సినిమా : టాలీవుడ్‌ నటి సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆమె, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులు పండంటి మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. నవంబరు 19న తమకు కుమారుడు జన్మించినట్లు ఈ జంట ప్రకటించింది. శుక్రవారం (నవంబరు 20) సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు, తమ గారాలపట్టి పేరును ‘దేవ్ నిడిమోరు’గా ఖరారు చేసినట్లు వెల్లడించింది. చిన్నారి చేతిని సమంత, రాజ్‌ పట్టుకున్న అందమైన ఫొటోను షేర్ చేస్తూ.. తమ హృదయాలు ఎన్నడూ లేనంత…