భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టెప్పో నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ను, అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీడీవో సింగారపు కుమార్ తో కలిసి మంగళవారం సందర్శించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల్లోని పఠనాశక్తిని,విద్యా ప్రమాణాలను పరిశీలించారు.ఆయా సబ్జెక్టులపై ఎంత పట్టు ఉందో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.చదువు పట్ల ఆసక్తి కలిగి ఉంటూ క్రమశిక్షణతో విద్యార్జన చేయాలని స్టూడెంట్స్ కు సూచించారు. లక్ష్యాలను ఎంచుకొని వాటి సాకారానికి ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు.రిజిస్టర్లను తనిఖీ చేశారు.విద్యార్థులలో…