భారత్ సమాచార్, జాతీయం ;
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయాలు మొత్తం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే తిరుగుతున్నాయి. గ్రామాల్లో కూడా ఏ ఇద్దరు కలిసిన ప్రస్తుతం దీని గురించే చర్చిస్తున్నారు. మే 13న జరుగబోయే పోలింగ్ ను కూడా ప్రభావితం చేసేంతగా ఈ యాక్ట్ కు ప్రచారం కల్పించారు రాజకీయ నాయకులు. ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థలో చాలా లోపాలున్నాయని, వాటిని అధిగమిస్తూ కొత్త వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ యాక్ట్ ను తీసుకొచ్చినట్టు చెబుతోంది.…



