భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 అద్భుతమైన ముగింపును అందుకుంది. సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టి, ఎందరో సెలబ్రిటీలను వెనక్కి నెట్టి కల్యాణ్ పడాల విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు.
సామాన్యుడి నుంచి విజేత వరకు..
కల్యాణ్ పడాల ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన ఒక CRPF జవాన్. దేశ సరిహద్దుల్లో సేవ చేస్తున్నప్పటికీ, ఆయనకు మొదటి నుంచీ వెండితెరపై మక్కువ ఉండేది. బిగ్‌బాస్ నిర్వాహకులు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ పోటీలో గెలిచి, కామన్‌మ్యాన్ కోటాలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రూ.20 లక్షల గోల్డెన్…

