భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ముప్కాల్ గ్రామపంచాయతీలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ ఆరోపించారు. గ్రామసభ ఆమోదం లేకుండానే 15వ ఫైనాన్స్ నిధుల నుంచి ₹.25.30 లక్షలు ఖర్చు చేసినట్లు ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

శుక్రవారం ముప్కాల్ మండల కేంద్రంలో గ్రామస్తులతో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సంతోష్ మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టం-2018కు విరుద్ధంగా ముప్కాల్ సర్పంచ్, ఆమె భర్త వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. గ్రామసభ అనుమతి…