భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులకు యూరియా అందుతుందని ఎవరూ అధైర్య పడొద్దని బిజెపి ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఫెర్టిలైజర్ యజమానిని, ప్రజలను సమన్వయ చేస్తూ ఆయన మాట్లాడారు. యూరియా బస్తాలు తప్పనిసరిగా వస్తాయని ప్రతి రైతుకు అందేలా అధికారులు చూస్తున్నారని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి యూరియా బస్తాలు అందేలా అధికారులు చూస్తున్నారని అన్నారు.






