భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ : జిల్లా కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ (TGTA) జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్‌లు ఘనంగా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమని, నూతన సంవత్సరంలో అధికారులు మరింత అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టిజిటిఏ అధ్యక్షుడు…