భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులైన ముద్దగల్ల కవిత నరేష్ నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజి రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి నిరుపేద ఇంటికి ఇందిరమ్మ ఇంటిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం…