భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

కోరిన కోర్కెలు నెరవేర్చే శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరము నుంచి ఆవిర్భవించినది. వర అంటే శ్రేష్ఠమైనది అని అర్థం.వరలక్ష్మి అంటే శ్రేష్ఠమైన వరాలనిచ్చే చల్లని తల్లి. చంద్రుడు కూడా శ్రీ మహాలక్ష్మీ దేవితో పాటు క్షీర సాగరము నుంచే ఆవిర్భవించారు. చంద్రుడు శ్రీ మహాలక్ష్మీ దేవికి సోదరుడు. పౌర్ణమి ముందు చంద్రుడు సంపూర్ణమైన కాంతితో పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తుంటాడు. ఆ పూర్ణ చంద్రుని చూచి శ్రీ మహాలక్ష్మీ దేవి ఆ సమయమున ఎంతో సంతోషముగా ఉంటుంది .…