భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల భద్రతపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు, వారి సహాయకులు గాయపడిన ఘటన ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై ఆందోళన కలిగిస్తోందని ఆమె అన్నారు. తాజా ఘటనలో రోగులు, ఆసుపత్రి సిబ్బంది సహా పలువురికి గాయాలైనట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తారా?

రోగులకు భరోసా కల్పించాల్సిన ఆసుపత్రిలోనే పైకప్పులు కూలుతుంటే…