భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామాల్లో తరచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ మండలంలోని మునిగలవీడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో మహబూబాబాద్–తొర్రూరు ప్రధాన రహదారిపై మునిగలవీడు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట చీకట్లో కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ఒకవైపు విద్యుత్ కోతలు లేవని చెబుతున్నప్పటికీ, గ్రామాల్లో మాత్రం రోజులో పలుమార్లు కరెంటు సరఫరా నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.…