భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ “ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్” అవార్డు ట్రంప్‌కు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

 

ట్రంప్ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతి స్థాపనకు చేసిన కృషిని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రశంసించింది. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులను తగ్గించడంలో, బందీల విడుదలకు సంబంధించిన చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్న అనేక…