భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి ‘శశిరేఖ’ అంటూ సాగే పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతానికి చిరంజీవి–నయనతార వేసిన క్లాసిక్‌ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను భీమ్స్‌, మధుప్రియ ఆలపించారు. కలర్‌ఫుల్ లొకేషన్లలో తెరకెక్కిన ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో మంచి స్పందన పొందుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాటతో హిట్‌ సాధించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు.…