భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. గ్రామంలో సీసీ (కాంక్రీట్) రోడ్ల నిర్మాణానికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల్లో మౌలికవసతుల అభివృద్ధి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని తెలిపారు. గుండ్లపల్లి గ్రామ ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా రాకపోకలు సులభమవుతాయని, వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో గ్రామంలో…