భారత్ సమాచార్, (ఇనుగుర్తి), మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం మహిమాన్విత చారిత్రక శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో కొలువై ఉన్న ముగురమ్మలు ముత్యాలమ్మ తల్లి, మారెమ్మ,పెద్దమ్మ లతోపాటు ఉపాలయంలోని లోతుగుంట మైసమ్మ తల్లులకు కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామస్తులు ఆదివారం ఘనంగా బోనాలు నిర్వహించారు. కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులపై ఇంటిల్లి పాది తరలివచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ తమ వాహనాలలో ముత్యాలమ్మ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేశారు. పట్నాలు వేశారు. అనంతరం డప్పు చప్పుళ్ల హోరులో, శివశక్తుల పూనకాల మధ్య మహిళలు…
చిన్ననాగారం ముత్యాలమ్మకు వెంకటగిరి గ్రామస్తులు బోనాలు





