భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు వారే వేణుగోపాల్ విమర్శించారు. పాపన్నపేటలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేసి విద్యార్థులను ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని…