భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా : మహిళలు లేని సమాజాన్ని లేదా ప్రపంచాన్ని ఊహించలేమని కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు హెచ్చు అలివేలు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందిని ఆమె ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, డ్వాక్రా సంఘాల లీడర్లు, ఆశా కార్యకర్తలు, జిపి సిబ్బందికి శాలువాలు కప్పి గౌరవించారు.
అలివేలు మాట్లాడుతూ.. మహిళలు తాము ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అద్భుతమైన…





