భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్‌ను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్లును లోక్‌సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటు అంటే.. ఏదైనా బిల్లు కానీ తీర్మానంపై సభలోని సభ్యులు తమ అభిప్రయాన్ని అవును.. లేదా కాదంటూ మూకుమ్మడిగా అరిచి చెప్పడమే మూజువాణి ఓటు.
ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ఎంతో మంది యువత బానిసై బలైపోవడంతోపాటు మనీలాండరింగ్, ఆర్థిక మోసాల వంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డగా మారడంతో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నియంత్రించడం కోసం ఈ బిల్లును రూపొందించింది. అయితే ఆన్‌లైన్ గేమ్స్, ఈస్పోర్ట్స్ మధ్య విభజన ఉండేలా ఈ బిల్లును తయారుచేశారు. ఎవరైనా రూల్స్ పాటించకుండా ఆన్‌లైన్ గేమ్స్ అందించే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ.కోటి జరిమానా.. లేదా ఈ రెండు కూడా విధించాలని ప్రతిపాదించింది కేంద్రం.
అంతేకాదు సంబంధిత అజ్వర్టయిజ్‌మెంట్లలో భాగం పంచుకున్నే వారికి రెండేళ్ల జైలు శిక్ష.. రూ.50లక్షల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించింది కేంద్రం. అలాగే ఈ బిల్లు ప్రకారం ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లు నేరస్థులగా కాకుండా బాధితులుగా పేర్కొంది కేంద్రం. మరోవైపు ఈ బిల్లు వల్ల తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.
మరిన్ని కథనాలు:
Shashi Tharoor: భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించాలి: శశిథరూర్