August 22, 2025 2:37 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

OTT Movies: ఈ వారం ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్న చిత్రాలు ఇవే..!

భారత్ సమాచార్.నెట్: ప్రతీ వారంలాగే ఓటీటీలో వినోదం అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటిటిలో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ డ్రామ్ హరిహర వీరమల్లు ఇప్పటికే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. హరిహర వీరమల్లు క్లైమాక్స్ సహా కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేసి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తెచ్చింది.

 

విమర్శకుల నుంచి ప్రశంసలు పొందిన మలయాళ సినిమా ‘సూత్రవాక్యం’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే నెట్‌ ఫ్లిక్స్ వేదికపై పహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మారీశన్’… విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన సార్ మేడమ్ కూడా ఆగస్ట్ 22 అంటే రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.

 

ఇక ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్న వెబ్‌సిరీస్, చిత్రాలు ఇవే:

 

మా (హిందీ మూవీ) ఆగస్టు 22

ది కిల్లర్‌ (మూవీ) ఆగస్టు 24

అమెజాన్‌ ప్రైమ్‌

రోడ్‌ఆన్‌ ఏ మిలియన్‌ సీజన్‌2 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 22

జియో హాట్‌స్టార్‌

పీస్‌ మేకర్‌సీజన్‌2 (వెబ్‌సిరీస్) ఆగస్టు 21

యాపిల్‌ టీవీ

ఇన్‌వేషన్‌: సీజన్‌3 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 22

 

మరిన్ని కథనాలు:

Samantha: వాటికే తొలి ప్రాధాన్యత ఇస్తా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Share This Post