భారత్ సమాచార.నెట్, ఢిల్లీ: భారత్ జలాలు ఇప్పటి వరకు శుత్రవుల దాహం తీర్చాయని.. ఇక మీదట అలా జరగనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సింధూ జలలాపై పూర్తి హక్కులు మనకే ఉన్నాయని.. 70 ఏళ్లుగా మన నీళ్లను దాయాది పాక్ తీసుకుందని.. ఇప్పుడు వాటిని మన దేశం కోసమే వాడుకుందామన్నారు. దేశ సంక్షేమం కోసం సింధు జలాల ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.
పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30 సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఎర్రకోటకు చేరుకొని త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఎర్రకోట వేదికగా యువత కోసం ప్రధాన మంత్రి వికసిత భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఈ పథకంలో యువత కోసం లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్న ప్రధాని.. తొలిసారి ఉద్యోగం పొందిన వారికి రూ. 15వేల చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. అలాగే త్వరలో మేడిన్ ఇండియా చిప్‌లు కూడా మార్కెట్‌లో అందుబాటులో వస్తాయన్నారు.