భారత్ సమాచార్.నెట్: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆదిత్య సర్పొదార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం థామాలో ఆయుష్మాన ఖురానా, రష్మిక మందన్నా, నవాజుద్ధిన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ హారర్ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఈ మేరకు మూవీకి సంబంధించిన నటీనటుల ఫస్ట్ లుక్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా అలోక్గా కనిపించనుండగా.. తడకా పాత్రలో రష్మిక నటిస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ పొడవాటి జుట్టుతో మూవీలోని పిశాచి థీమ్‌ను సూచిస్తుండగా.. యక్షసన్‌గా సిద్ధిఖీ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రేమే ముఖ్య కథాంశంగా ఉండనుందని టాక్.
ఇకపోతే మ్యాడక్ హారర్ కామెడీ యానివర్స్‌లో వచ్చిన అనేక సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. 2018లో స్త్రీతో ప్రాంభించి.. భేడియా, ముంజ్యు, స్త్రీ సీక్వెల్ వంటి హారర్ కామెడీ చిత్రాలను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటికి పూర్తి భిన్నంగా థామా చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా థామా చిత్రానికి సంబంధించిన మొదటి గ్లింప్స్ ఆగస్ట్ 19న విడుదల చేయనున్నారు మేకర్స్.