భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే సాకుతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ టారిఫ్‌లపై రష్యా తీవ్రంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది ద్వంద్వ వైఖరి అని.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై టారిఫ్‌లు విధించడం దుర్మార్గపు చర్య అని తివ్రంగా విమర్శించింది.
ఈ మేరకు భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. క్రూడాయిల్ కొనుగోలుపై భారత్‌కు 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం. సరఫరా మార్పు జరగదని భారత్ అర్థం చేసుకుందని.. దీని వల్ల భారత్ ఎక్కువ లాభాలు పొందుతుందని పేర్కొంది. రష్యా క్రూడాయిల్‌కు నిజమైన ప్రత్యామ్నాయం లేదు.. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అత్యంతో పోటీతత్వాని కలిగి ఉందని తెలిపింది.
అంతే కాదు భారత్ తమకు అత్యంత కీలకమైన మిత్రదేశామని స్పష్టం చేసిన రష్యా.. భారత్ వాణిజ్య లావాదేవీలు మరింత సులభతరం చేయడానికి మెరుగైన చెల్లింపు పద్ధతుల రూపకల్పనకు తాము కట్టుబడి ఉన్నామని రష్యా రాయబార కార్యాలయం పేర్కొంది. అదే సమయంలో ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారని కూడా రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ప్రధాని మోదీతో పుతిన్ సమావేశం అవుతారని.. పుతిన పర్యటనకు సంబంధించిన తేదీలపై చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది.
మరిన్ని కథనాలు:
Putin India Visit: ట్రంప్ టారిఫ్‌ల వేళ.. భారత్ పర్యటనకు పుతిన్