August 22, 2025 2:34 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Samantha: వాటికే తొలి ప్రాధాన్యత ఇస్తా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ హీరోయిన్ సమంత.. ప్రముఖ మ్యాగజైన్ గ్రేజియా ఇండియాపై ఇటీవల మెరిసిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సమంత ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను గ్రేజియా ఇండియా పంచుకుంది. ఇక తాజాగా గ్రేజియా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాదు తాను సినిమాల్లో తక్కువగా కనిపించడంపై కూడా సమంత స్పందించారు.

 

గ్రేజియా ఇండియా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. కెరీర్‌లో ఎన్ని చిత్రాలు చేశాను అనే దానికంటే.. ఎంత మంచి చిత్రాలను చేశామనదే ముఖ్యమని సమంత పేర్కొన్నారు. ఇకపై ఎక్కువ సినిమాలు చేయనని.. తన శరీరం చెప్పే మాట వినాలనుకుంటున్నాని అని తెలిపారు. తక్కువ చిత్రాలు చేసినా.. అభిమానుల మనసుకు నచ్చే కథలనే ఎంచుకుంటానని పేర్కొన్నారు.

 

అంతేకాదు తాను చేస్తున్నా చిత్రాలన్నీ కూడా కేవలం ఫ్యాషన్, గుర్తింపు కోసమో కాదని.. అవన్నీ తన మనసుకు దగ్గరైన కథలే అని సామ్ వివరించింది. సినిమాల సంఖ్య తగ్గినా.. మంచి ప్రాజెక్టులతో ప్రేక్షకులు మందుకొస్తానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాను అని.. గతంలో కంటే ఇప్పుడు తన ఆరోగ్యం విషయంలో ఎంతో మార్పువచ్చిందని చెప్పారు. కాగా ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్, పలు వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.

మరిన్ని కథనాలు:

Samantha: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్‌’పై పుకార్లు.. మేకర్స్ క్లారిటీ

Share This Post