August 22, 2025 2:40 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Samantha: ప్రముఖ మ్యాగజైన్‌‌పై మెరిసిన నటి సమంత

భారత్ సమాచార్.నెట్: స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభుకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ మ్యాగజైన్ ‘గ్రేజియా ఇండియా’ తాజా ఎడిషన్‌ కవర్ పేజీపై సమంత తళుక్కుమన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా వీటిని విడుదల చేసింది గ్రేజియా ఇండియా మ్యాగజైన్. అంతే కాదు సమంత సినీ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 15 ఏళ్ల సినీ జీవితంలో సమంత గుర్తుండిపోయే పాత్రలు పోషించారంటూ ప్రశంసించింది.

 

ఈ ఫొటోలో సమంత 22 క్యారెట్ల బంగారం ఉంగరంతో, మణుల గాజులతో తళుక్కుమన్నారు. నటిగా కాకుండా ఇప్పుడు సరికొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారని.. నటి నుంచి నిర్మాతగా సమంత తన మార్గాన్ని ఎంతో విభిన్నంగా ఎంచుకున్నారని గ్రేజియా ఇండియా మ్యాగజైన్ పేర్కొంది. ప్రస్తుతం సామ్ కవర్ పేజీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాగజైన్ కవర్ పేజీపై సమంత రావటంపై సామ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇకపోతే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సామ్ రక్త్ బ్రహ్మాండ్, ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో సమంత నటించనున్నట్లు సమాచారం. ఖైదీ 2 చిత్రంలో కూడా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఏడాది సామంత సొంత నిర్మాణ సంస్థ త్రలాలా నిర్మించిన శుభం సినిమాలో సమంత అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని కథనాలు:

Sam-Raj Nidimoru: అమెరికా వీధుల్లో సామ్-రాజ్ నిడిమోరు.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Share This Post