August 22, 2025 2:38 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Shashi Tharoor: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కేంద్రానికి శశిథరూర్ సపోర్ట్

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లుపై శశిథరూర్ స్పందించారు. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడాన్ని శశిథరూర్ తప్పుబట్టారు. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయమని.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో తనకెలాంటి తప్పు కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

ఎవరైనా తప్పు చేస్తే మంత్రి లేదా ప్రధాని పదవిలో ఉండకూడదన్నారు. అయితే తాను తాను ఇంకా బిల్లును పూర్తిగా చదవలేదని, తన ఈ అభిప్రాయమే చివరిది కాదని శశిథరూర్ స్పష్టం చేశారు. ఇక ఈ బిల్లులను కేంద్రం జేపీసీకి పంపడంపై కూడా ఆయన స్పందించారు. ఇది చాలా మంచి విషయమని.. ప్రజాస్వామ్యానికి ఇది మేలు చేస్తుందని భావిస్తున్నానని శశిథరూర్ పేర్కొన్నారు.

 

కాగా, ప్రధానమంత్రి గాని, కేంద్ర మంత్రిగాని, ఏ రాష్ట్రా ముఖ్యమంత్రి అయిన తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి నెల రోజులపాటు జైలులో ఉంటే.. వారిని పదవి నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు) 2025 బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకిస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రానికి మద్దతుగా నిలవడం విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

మరిన్ని కథనాలు:

Union Government: మూడు కీలక బిల్లులను జేపీసీకి పంపిన కేంద్రం

Share This Post