భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటి, సింగర్ శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం థగ్‌లైఫ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే థగ్‌లైఫ్ ఫెయిల్యూర్‌పై మీ తండ్రిపై ప్రభావం చూపుతుందా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో శ్రుతి హాసన్ బదులిచ్చారు. ఒక సినిమా హిట్, ఫ్లాప్ తన తండ్రిని ఏమాత్రం ప్రభావితం చేయలేవని పేర్కొంది.
తన తండ్రికి డబ్బు ముఖ్యం కాదని.. ఆయన సంపాదించిన డబ్బునంతా సినిమాల్లో పెట్టేందుకు వెనకాడని మనస్తత్వం ఉన్న వ్యక్తి అని శ్రుతి హాసన్ పేర్కొన్నారు. సినిమాల నుంచి వచ్చిన డబ్బును సినిమాల్లోనే పెట్టారన్నారు. బాక్సాఫీస్ నంబర్స్ అనేది నవతరం ధనవంతుల సమస్య అని.. తన తండ్రిపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కాగా, శ్రుతి హాసన్ తన తండ్రికి అండగా నిలిచిన తీరుపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా నాగార్జున నటించగా.. ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఆగస్ట్ 14 రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల మార్క్‌ని దాటింది.
మరిన్ని కథనాలు:
కల్కిలో 7 నిమిషాల పాత్రకు కమల్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!!