August 22, 2025 2:35 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రతో గగన్‌యాన్‌కు తొలి అడుగు

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రతో గగన్‌యాన్‌ ప్రాజెక్టు తొలి అడుగు పడిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే గగన్‌యాన్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంలో శుక్లా అంతరిక్ష అనుభవాలు అత్యంత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ చేపడుతున్న అంతరిక్ష సంస్కరణలకు మరింత ముందుకు సాగేందుకు గగన్‌యాన్‌ కీలకంగా మారుతుందని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

2040 నాటికి భారత్‌కు 40 నుంచి 50 మంది కొత్త వ్యోమగాములను సిద్ధం చేయాలని శుక్లాకు సూచించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో భారత్ అంతరిక్ష కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తోందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. కాగా, 2040 నాటికి భారత్ ఆస్ట్రోనాట్‌ను చంద్రుడిపైకి పంపే ప్రణాళికలను కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది అంతరిక్షంలోకి వ్యోమమిత్ర రోబోను కేంద్రం పంపనున్న సంగతి తెలిసిందే.

 

ఇకపోతే ప్రపంచం మొత్తం గగన్‌యాన్‌ మిషన్‌పై ఆసక్తి కనబరుస్తోందని.. ఇందులో భాగం కావడానికి అనేక మంది శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారని ప్రధాని మోదీకి చెప్పారు శుభాన్షు శుక్లా. ఆక్సియం 4 మిషన్ అంతరిక్ష యాత్ర ముగించుకుని భూమికి సురక్షితంగా చేరుకున్న శుభాన్షు శుక్లా ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని మోదీతో తన అంతరిక్ష అనుభవాలను పంచుకున్నారు.

 

మరిన్ని కథనాలు:

Shubhanshu Shukla: రోదసి యాత్ర తర్వాత.. తొలిసారిగా స్వదేశానికి శుభాన్షు శుక్లా

Share This Post