భారత్ సమాచార్.నెట్: భారత్ వ్యోమగామి శుభాన్షు శుక్లా రేపు స్వదేశానికి చేరుకోనున్నారు. ఆక్సియం మిషన్ 4 విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తొలిసారిగా శుభాన్షు శుక్లా భారత్‌కు వస్తున్నారు. విమానంలో కూర్చున్న సమయంలో తనకు కలిగిన భావోద్వేగాలను సోషల్ మీడియా వేదికగా శుభాన్షు శుక్లా పంచుకున్నారు. గతేడాది నుంచి తన కుటుంబసభ్యులు, స్నేహితులకు దూరంగా ఉండడం ఎంతో కష్టంగా అనిపించిందని.. ఇప్పుడు వారిని కలుసుకునే ఆత్రుతతో ఉన్నానని పేర్కొన్నారు.
అయితే శుభాన్షు శుక్లా రేపు భారత్‌లో ల్యాండ్ అవనుండగా.. ఆ మరుసటి రోజే ప్రధాని మోదీని కలవనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధానితో పాటు దేశ ప్రజలకు తన అంతరిక్ష అనుభవానలు పంచుకోనున్నారు. అంతేకాదు ఈ నెల 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆక్సియం 4 మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇకపోతే అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ఆక్సియం స్పేస్ చేపట్టిన ఆక్సియం మిషన్ 4లో భాగంగా జూన్ 25న శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి రోదసిలోకి వెళ్లారు. 18 రోజులపాటు రోదసిలో ఉండి అనేక ప్రయోగాలు నిర్వహించి జూలై 15న భూమిపై సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. అయితే భూమికి చేరుకున్న వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించగా.. తాజాగా శుక్లా స్వదేశానికి వస్తున్నారు.
మరిన్ని కథనాలు:
Pm Modi-Shukla: మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ.. మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు: ప్రధాని మోదీ